Thursday, June 23, 2011

నా మొబైల్ లో ఫొటోలు

వారసుల సినిమాలన్నాక వంశాల గొప్పలు తప్పదన్నట్లు మొబైలున్నాక అందులో కొన్ని ఫొటోలు పెడతాం.కిలో తూకం రాయిలాంటి పాతకాలపు వస్తువులను మినహాయిస్తే... thumbnail 1 summary

వారసుల సినిమాలన్నాక వంశాల గొప్పలు తప్పదన్నట్లు మొబైలున్నాక అందులో
కొన్ని ఫొటోలు పెడతాం.కిలో తూకం రాయిలాంటి పాతకాలపు వస్తువులను మినహాయిస్తే
దాదాపు ప్రతి కొత్తతరం మొబైల్ లోనూ ఈ సౌకర్యం ఉంది కాబట్టి అందులో
పెద్ద వింతేమీ లేదు.అందరిలాగానే నేనూ కొన్ని ఫొటోలు ఎక్కించా.మా పిల్లలు,
మా మరదలి చిన్న కొడుకూ,ఇక మా ఆవిడ ఫొటో ఎటూ తప్పదు కదా!ఇవి కాక
సావిత్రి,మాయాబజార్ లో యస్వీఆర్,రేలంగి,కె.వి.రెడ్డి,ఆదుర్తి,యస్.డి.బర్మన్,
బాపూ గీసిన బుద్ధుడి బొమ్మ ఉన్నాయి.ఈమధ్య మా మిత్రుడొకాయన
ఈ ఫొటోలన్నీ చూసి ఇంతవరకూ ఓకేగానీ ఉండాల్సిన మరొక రెండుఫోటోల్లేవు తెలుగు
సినిమాలకు సంబంధించి అన్నాడు."అయ్యా,నా అభిమాన నటుడు హీరో కృష్ణకే
ఇందులో నేను తావివ్వలేదు,మీరనుకునే ఆ యిద్దరితో నాకుపనీలేదు,పేచీ లేదు"
అన్నా."అలాక్కాదు,తెలుగు సినిమాకు సంబంధించినంతవరకూ వాళ్లిద్దరి ఫోటొలు
ఉండితీరాల్సిందే"అని రెట్టించాడు.పేర్లు చెప్పవయ్యా బాబు అంటే చెప్పడు,మీరేమన్నా క్లూ
ఇస్తారా?

3 comments

రిషి said...

వారసుడు...తూకం రాయి...
:)))

voleti said...

NTR (SR) & ANR ... AM I RIGHT

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

ఈ టపాకి ఊహాతీతమైన స్పందన వచ్చింది.అందరికీ ధన్యవాదాలు.రిషి గారు మీక్కూడా :)
వోలేటి గారు మీకు మరిన్ని
నేను చాలా జతలు ఊహించిమరీ చెప్పానండీ ఆయనకి కానీ ఇవేవీ కావన్నాడు మరి!
ఆ జతల్లో కొన్ని
రేలంగి-రమణారెడ్డి (రేలంగి ఇప్పటికే వున్నాడు)
సూర్యకాంతం-ఛాయాదేవి,
పద్మనాభం-రాజబాబు
పద్మనాభం-గీతాంజలి
రాజబాబు-రమాప్రభ
నాగభూషణం-అల్లు
రావుగోపాలరావు-అల్లు
జ్యోతిలక్ష్మి-జయమాలిని
సిల్క్ స్మిత-డిస్కో శాంతి
హలం-జయకుమారి
ఇలాంటివి మరికొన్ని ఇవేవీ కావంటున్నాడు