Monday, June 27, 2011

యన్.టి.ఆర్ ‘సింహబలుడు"తో చెతుర్లు కాదు

వెండితెర వణికింది.థియేటర్ గుండె దబదబలాడింది.సిల్వర్ స్క్రీన్ దాదాపుగా చీలింది. సినిమాహాలు హోలుమొత్తంగా సిరిగి చాటంతయ్యింది సింహబలుడి అవక... thumbnail 1 summaryవెండితెర వణికింది.థియేటర్ గుండె దబదబలాడింది.సిల్వర్ స్క్రీన్ దాదాపుగా చీలింది.
సినిమాహాలు హోలుమొత్తంగా సిరిగి చాటంతయ్యింది సింహబలుడి అవక్రవిక్రమపరాక్రమం చూసి.కె.రాఘవేంద్రరావు రామారావు కాంబినేషన్ లో వచ్చిన సింహబలుడు సినిమాకెళ్తే బోలెడు హాలీవుడ్ సినిమాలు,రాఘవేంద్రరావు దర్శకత్వం వహించినవీ,వహించబోయేవీ ఒక్కసారే ఊరికే చూసెయ్యొచ్చు.
తరతరాలుగా రాజభక్తులయిన కుటుంబంలో పుట్టి చిన్నతనంలో ఒకసారి రాజకుమారిని కొట్టి,తండ్రి అన్నమాటకు
పట్టుదలగా ఇల్లొదిలి,ఎక్కడో ఒక కుటుంబం ఆశ్రయం ఇస్తే పెరిగి,అక్కడే ఒక తాతను,తమ్ముడిని,చెల్లెలును,
మాడా లాంటి మిత్రుడిని సంపాదించుకుంటాడు మన రాముడు.
పనిలో పనిగా రాజసైనికులు జరిపే అకృత్యాలను ఎదిరిస్తూ ఉంటాడు.ఈలోపు మారువేషాలేసుకుని (అవును,బహువచనమే)రాజ్యంలో తిరుగుతున్న రాజకుమారి వాణిశ్రీ మనరాముడ్ని చూసి మనసు పారేసుకోవటం ‘యేందబ్బో చురుక్కుమంది’అంటూ పాటేసుకోవడం,మార్కెట్లో సైన్యాధిపతి,సినిమాకు మెయిన్ విలన్ మోహన్ బాబు దురాగతాలను జోరో,మాస్క్ ఆఫ్ జోరో,రిటన్ ఆఫ్ ది జోరో తరహాలో తిప్పికొట్టటం,మళ్ళీ బట్టలమూట తీసుకుని చాకిరేవు కొచ్చిన వాణిశ్రీతో‘చూపుల్తో ఉడకేసి ’అంటూ మరొక డ్యూయట్టేసుకోవడం... ఇలా జరుగుతూ ఉండగా కొన్ని నాటకీయపరిణామాలతో హీరో తండ్రి అయిన సత్యనారాయణకు లొంగిపోవటం,బానిసగా బ్రతకమని ద్వీపాంతరశిక్షకు గురైన రాముణ్ణి రాణీరణచండి యేలుబడిలోని ద్వీపానికి తరలిస్తారు.అక్కడ ఒక సంఘటనలో కథానాయకుడి కదనకుతూహలం స్వయంగా చూసిన రాణీరణచండి,అతన్ని సర్వాంగసుందరంగా అలకరించి నామందిరానికి తీసుకురండి’అని ఆజ్ఞాపించటం,తర్వాత ‘సన్న్జజాజులోయ్,కన్నెమోజులోయ్’అనే సూపర్ హిట్ సాంగ్.మదనజ్వరపీడితురాలు,పైగా మద్యోన్మత్తురాలు అయిన రాణికి రాముడు భీభత్సమైన క్లాసుపీకుతాడు.‘మగవాడ్ని పశువులా,బానిసలా నీచంగా చూసే నీకూ మగవాడితో అవసరముంటుందన్న నిజాన్ని నీకు తెలియజెప్పటానికే నీతో ఆడాను,పాడాను తప్ప నీ తుఛ్ఛమైన శరీరాన్ని చూసి కాదంటాడు.తర్వాతమళ్లీ మామూలుగా అతన్ని చీకటికొట్లోనే బంధిస్తారు.
ఈలోపు యువరాణి ఆ ద్వీపానికి రావటం,తన ప్రేమ ఎంత నిఖార్సయ్యింది హీరోకి చెప్పుకోవటం,వారు ఒక ఉపాయం
పన్ని అక్కడి సైనికులను హతమార్చి తప్పించుకోవటం,తనతండ్రి,మహారాజుకి బానిసల తరపున
సందేశం తీసికెళ్తున్న వాణిశ్రీ మోహన బాబు బృందం కిడ్నాప్ చెయ్యటం,చివరికి భారీ క్లైమాక్స్ల్ లో దుష్టశిక్షణ జరిగిపోవటం జరిగిపోతాయి.
కథానాయకుడు రామారావు పాత్రపేరు రాజేంద్ర మనకెంతానందం మనపేరు హీరోకిపెట్టటం.మనుషులంతా ఒక్కటే
అనే మరొక సినిమాలో కూడా రామారావు పాత్రపేరు రాజేంద్రే.తండ్రివారసత్వం స్వీకరించిన బాలకృష్ణ కూడా
‘భలేతమ్ముడు’అన్న సినిమాలో ఆపేరు పెట్టుకున్నాడు.గతంలో కంచుకోట,పెత్తందార్లు,రాజకీయాల్లోకి
వచ్చేముందు నటించిన సినిమాల్లోని రాజకీయసంభాషణలు రామారావునోటివెంట ఈ సినిమాలో అలవోకగా
పలుకుతాయి.క్లైమాక్స్ లో ఇనపగొలుసులను రామారావు తెంపే సీను చూసితీరాలంతే.చెప్పటానికొల్లగాదు.
యువరాణిగా వాణిశ్రీది మంచిప్రాముఖ్యం గల పాత్ర.మహారాజుగా రావుగోపాలరావుకు స్పార్టకస్ లో పీటర్ ఉస్తినోవ్
ఆహార్యం,కో వాడిస్ లోని పాత్రను జస్ట్ అనుకరిస్తున్నట్టుగా ఉంటాయి.అసలు సినిమామొత్తం దాదాపు కిర్క్ డగ్లస్ నటించిన అమోఘమైన హాలీవుడ్ క్లాసిక్ స్పార్టకస్ కు థర్డ్ రేట్ అనుకరణ.అయినామనతెలుగు సినిమాల స్థాయికి కాస్త అధికంగా నే ఉంటుంది.న్యాయమూర్తి రఘునాథనాయకుడు గా సత్యనారాయణ,అతని భార్య భాగ్యంగా అంజలీదేవి,సైన్యాధిపతి గజపతివర్మ గా మోహన్ బాబు,రాణీరణచండిగా జయమాలినివి ప్రధానపాత్రలు.
వాణిశ్రీ మొదటిసారి హీరో యింటికి వచ్చినప్పుడు అక్క్డడ కేవలం నేపథ్యసంగీతంతో అందరూ ఆడుతూ ఆనందించే
సన్నివేశం చాలా బాగా తీసాడు దర్శకుడు.అదే విధంగా బానిసలను పంపే దీవి అధిపతి త్యాగరాజు దగ్గర డాన్స్ మాస్టర్ సలీం,హలం డాన్సు,ఆ డాన్సుకు చిడతల అప్పారావు,సూర్యప్రకాశరావు(సూరప్పడుగా ఒకప్పడు ప్రసిద్ధులు)తీసే అదేదో రాగం నవ్విస్తాయి.
‘మైసూరుమహారాజా ప్యాలస్’,‘రాజేంద్రసౌధ’ ముందు వేసిన భారీ సెట్టింగులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.బెన్ హర్ లోని రథాలపోటీ,అంతకుముందే ఆ సినిమాలో మా అభిమాననటుడు తీసిన ఎవర్ గ్రీన్ హిట్ సినిమా పాడిపంటలులో రథచక్రాలను మరొక పళ్ళకత్తెరతో నుజ్జునుజ్జు చేయటం వచ్చేసినా రథంపోటీ అన్నాక అసలా సీను లేకపోతే ఎలా అని బెంగపెట్టుకోకుండా మళ్ళీ పెట్టేసారు.
1978లో వచ్చిన ఈ సినిమా భారీవిజయం సాధించకపోయినా దీనికి దాదాపుపోటీగా వచ్చిన ‘సింహగర్జన’ కన్నా
మెరుగైన ఫలితాలే రాబట్టింది.ఈ సింహగర్జన ఎవరైదంటారా?రామారావు,నాగేశ్వరరావు సినిమాలకు
పోటీగా సినిమాలు తీసే దమ్మున్న హీరో అప్పట్లో ఒక్క కృష్ణే కదా!అయితే ఆ సినిమా నిర్మాత గిరిబాబు అనుకోండి,
అది వేరే సంగతి.
మీకు దగ్గరలోని యేదన్నా సినిమాహాలుకొస్తే ఈ సినిమా మిస్సవకండి.లేదంటే మంచి క్వాలిటీ వున్న డీవీడీ సంపాదించి చూడండి.పైసావసూల్ ఖాయం.
ఈ సినిమాలో పాటలు వినేందుకు ఇక్కడ:http://www.chimatamusic.com/telugu_songs/oldmovplist.php?st=328
చూసేందుకు ఇక్కడ:http://www.youtube.com/results?search_query=simhabaludu+telugu+songs&aq=1&oq=simhab
తెవికీలో యేదో నాలుగుముక్కలు రాసి వదిలేసారు ఈ సినిమా గురించి ఎందుకో???


14 comments

రవికిరణ్ said...

అప్పట్లో "సన్న జాజులోయ్.." పాటని ఎంటీవోడే పాడాడని అనుకుంటూ ఉండేవాడ్ని.. :-)

ఎప్పుడో చూసినగుర్తు.. అవకాసం దొరికితే మళ్లీ చూడాలి.

knmurthy said...

mee review bagundi .

oremuna said...

యన్టీవోడు గొలుసులు తెంపే సీనంటే - శ్రీకాకుళాంధ్రమహావిష్ణు సినిమానే.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

రవికిరణ్ గారు అలా అనుకోవటంలో మీ తప్పేమీ లేదులెండి.బాలు అలా
మ్యానేజ్ చేసాడు :)
కె.యన్.మూర్తి గారు ధన్యవాదాలు
కిరణ్ అయితే మళ్ళీ చూడాలా సినిమాను పెద్దపనేపెట్టారు నాకు :)

కమల్ said...

మీ సమీక్ష వ్యంగమా..? లేక సమీక్షనా అర్థం కాలేదు..! అయినా ఇప్పుడూ ఈ సినిమా మీద సమీక్ష ఆశ్చర్యంగా వున్నది

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

కమల్ గారు-వ్యంగ్యమా,సమీక్షా అన్న విచికిత్సకు మిమ్మల్ని గురి చేసినందుకు నన్ను మన్నించాలి.మొన్న
ఆదివారం మా మిత్రుకొకాయన ఈ సినిమాకు తీసుకెళ్ళారండి.ఎప్పుడో చిన్నప్పుడు చూసాను,మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత చూసాకా నాలో కలిగిన భావానుభూతులు ఇలా పంచుకున్నానన్నమాటండి.ఏదో అప్పుడప్పుడు అలా సినిమాల గురించి నాలుగుముక్కలు కెలుకుతుంటాను అంతకన్నా ఇంకేమీలేదు.

కొత్త పాళీ said...

ఆ రోజుల్లో అన్నగారికి వీరాభిమానిని అయినా, ఈ సినిమా కటవుట్లు చూశాక సినిమా చూసే సాహసం చెయ్యలేకపోయాను :)

Anwar said...

వ్యాసం వ్యంగం అవునా కాదానే దాంతొ సంభందం లేకుండా నాకు బాగా నచ్చింది, హానెస్ట్లీ అవునన్నా కాదన్నా ఇవన్ని చిన్నతనంలొకి లాక్కెళ్లిపొతాయి, అందుకు మీకు థేంక్స్, ఏదేమైనా అట్లాంటి ఎంటీఆర్ పర్సనాలిటి టార్జన్, సూపర్ మాన్ ల వేషాలు వెయ్యడం ......... ఎంటీఆర్ సాహసానికి , ప్రేక్షకుల ధైర్యానికి ఇప్పటికి జీర్ణం చేసుకొలేను నేను.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

కొత్తపాళీ గారు హెంత పని చేసారు :)పోన్లేండి ఇప్పుడోసారి చూసేద్దురూ.హీరో కృష్ణ అభిమానులమైన మాలాంటివాళ్ళం మా హీరో సినిమాలు దాదాపు అస్సలు మిస్ కాలేదు.ఏదో ఒకటీ అరాతప్ప.కానీ సింహబలుడు అస్సలు మిస్సవాల్సిన సినిమా కాదే ఎవరి అభిమానులైనా :)

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

అవును అన్వర్ గారు ఇలాంటి సినిమాలు మనల్ని చిన్నతనంలోనికి చేయిపుచ్చుకుని మరీ వెంట తీసుకెళతాయి.నాప్రయత్నమూ అదే.మీరన్న సూపర్ మాన్ సినిమా వి.మధుసూధనరావు దర్శకత్వంలో వచ్చింది అది మరీ ఆశ్చర్యకరమైన విషయం.
పాపం ఆయన(యన్.టీ.ఆర్)సుబ్బరంగా వయసుకు తగ్గట్టు తీర్పు,బడిపంతులు ఇలాంటి సినిమాలు చేసుకూంటుంటే ఆయన్ను ఈదార్లోకి లాగింది,కె.బాపయ్య,అశ్వినీదత్ వగైరాలు తర్వాత ఆ సంప్రదాయాన్ని కె.రాఘవేంద్రరావు ప్రభృతులు కొనసాగించారు.

కమల్ said...

కొత్తపాళీ గారు సినిమా చూసే సాహసం చేయలేకపోయారా..? అదేంటండి..అప్పట్లో మేము ఇరగ చూశాము ఆ సినిమాని నా నిక్కర్ల కాలంలో. అప్పటికి ఇంకా టి.వీలు..వి.ఎచ్.ఎస్‌లు గట్రా లేవు కదా..సో సినిమాలు, డ్రామాలే కదా అప్పటి ప్రజలకు వినోదాలు..యన్.టి.ఆర్ ఏమి చేసినా చూసేవారు. ఆయన పర్శనాలిటికేమిటండి బాబు దిట్టంగా వుండేవారు.
అన్వర్‌గారు మీరు జీర్ణించుకోలేకపోయారా..? ఏమో గాని మాకు మాత్రం సూపర్...:D.
రాజేంద్రగారు.. యన్.టి.ఆర్ ఎప్పుడు వయసకు తగ్గ పాత్రలంటూ ఏమి చేయలేదుగాని..ఆయనకు ప్రతి పాత్ర చేయాలనే దురద, విపరీతమైన యావ ఒకటి ఉండేది..అందుకే అది అథిధి పాత్రైనా..ముఖ్యపాత్రైనా..ప్రాముఖ్యత లేని పాత్రైనా సరే చేశెవారు.. కాబట్టి వయసుకు తగ్గట్టు ఎంటూ ఎప్పుడు ప్రయత్నించలేదు

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

అన్నట్టుకమల్ గారు మీరు కూడా సినిమా పరిశ్రమకు చెందిన వారే కదా మీకు కాస్త సీనియర్ కె.బాపయ్య గారు ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆ మాటలు యన్.టీ.ఆర్ చేత మళ్లీ కుర్ర వేషాలేయించింది నేనే అని మరి మీరేమో ఇలా అంటున్నారు.అందుకే రామారావు సినిమాల లెక్క వేరు.వేసిన పాత్రల సంఖ్య వేరు:)

కమల్ said...

రాజేంద్రగారు, ఇంటర్వ్యూలలో అలానే ఉంటాయి మాటలు.." నేనే అవన్ని చేయించింది.. నావలనే అలాంటివి జరిగాయి.. నన్ను సంప్రదించాకే నా సలహా మేరకే అలా చేశారు " అని తమని ఇడెంటిఫై చేసుకోవడానికి చెప్పేవిదానాలు..!అవన్ని వారి ప్రొఫిషన్‌లో సర్వసాధారణంగా జరిగే ఒక ప్రక్రియ అంతే గానొ ఏ ఒక్కరి వలనో జరిగిందని చెప్పడం సందిగ్ధావస్థకు దారితీస్తుంది.
కె.బాపయ్యక మునుపు యన్.టి.ఆర్.. దేవుడు చేసిన మనుషులు,జీవితచక్రం, దేశోద్దారకులు, నిప్పులాంటి మనిషి తదితర సినిమాలలో వయసు ముదురుతున్నా కూడ..ముఖం మీద ముడతలు కనపడుతున్నాకూడ కుర్రహీరోగానే చేశారు...! తర్వాతే బాపయ్యగారు అశ్వనీదత్ ద్వార యన్.టి.ఆర్‌తో సినిమాలు మొదలెట్టారు. అప్పటికి అశ్వనీదత్ కుర్ర నిర్మాత. కొత్త నిర్మాతకు అనుభవం లేని వ్యక్తికి ఎందుకు సినిమా ఇచ్చానో అన్న విషయం కూడ యన్.టి.ఆర్ ఒక సందర్భంలో వివరించారు " కాలంతో బాటు ఆలోచనలు మారుతున్నాయి.. మేమా... వయసు మీరుతున్నది మా ఆలోచనలన్నీ పాతబడివుంటాయి.. అందుకే కొత్తవాళ్ళకు ఇప్పటి తరం వాళ్ళకు అవకాశమిస్తే ఇప్పటి వారి ఆలోచనలకు అనుగుణంగా కథలు తయారు చేస్తారు, ఇప్పటి యువతరం ఆలోచనలకు దగ్గరగా సినిమాలు తీసే అవకాశమున్నది అందుకే అశ్వనీదత్ లాంటికుర్ర నిర్మాతలకు అవకాశమివ్వడం " అన్నారు. ఎప్పటిదోలేండి ఈ మాట..నాకు ఇంకా గుర్తున్నది.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

కమల్ గారు ఎక్సలెంట్ చాలా బాగా చెప్పారు.అభిమాన్ని గాకపోయినా యన్టీఆర్ లో కొన్ని కోణాలు నాకు బాగా నచ్చుతాయి.