Saturday, November 12, 2016

నోటు మార్పు దేశంలో మార్పు తెస్తుందా?? ---------------------శేఖర్ బాబు

మొన్న నరేంద్ర మోడీ చలామణిలో ఉన్న రెండు పెద్ద కాగితాలను రద్దు చేసినట్లు ప్రకటించి దేశంలో నల్లధనం పై సర్జికల్ స్ట్రైక్ ప్రకటించామని చ... thumbnail 1 summary


మొన్న నరేంద్ర మోడీ చలామణిలో ఉన్న రెండు పెద్ద కాగితాలను రద్దు చేసినట్లు ప్రకటించి దేశంలో నల్లధనం పై సర్జికల్ స్ట్రైక్ ప్రకటించామని చెప్పుకున్నారు.
ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకుందాం ! పెద్ద నోట్లు రద్దు చెయ్యలేదు, కేవలం మార్పు మాత్రమే చేసారు. రద్దు చెయ్యడం అంటే పూర్తిగా భవిష్యత్తులో లేకుండా చలామణిలో లేకుండా చెయ్యడం. కానీ ఇక్కడ జరిగింది కేవలం మార్పు, అంటే ఉన్న వాటి స్థానంలో కొత్తవి చేరడం. వీటివల్ల ప్రస్తుతం అధికార పక్షం వాళ్ళు చెప్పేది ఏంటంటే, పూర్తిగా నల్లదనం దాచిన వారి అట కట్టినట్లే అని. డబ్బు కాకుండా ఇతర రూపాలలో దాచిన వారి పరిస్తితి ఏమిటి?? నోట్ల రూపంలో డబ్బును నిలువ చేసే తరం ఒకప్పటి తరం, ఇప్పుడు నల్లదనం బాగా వెనకవేసే తిమింగలాలు వస్తు రూపంలో అంటే భూములు, విదేశీ మారక ద్రవ్యం, బంగారం, వజ్రాలు వీటి రూపంలో దాస్తున్నారు. వాటిని బయటకు తేవాలి అంటే ఇలాంటి జిమ్మిక్కుల వల్ల అవుతుందా?? ఒకప్పుడు ఐదు వందల నోటు, వెయ్యి నోటు అంటే నోరెళ్ళ బెట్టి చూసేవారు కానీ ప్రస్తుతం మన దేశంలో సామాన్యుడు కూడా ఉన్న ధరల దృష్ట్యా జేబులో ఆ రెండు నోట్లలో కనీసం ఒక్క నోటు లేకుండా బజారు చెయ్యలేని పరిస్థితి. ఇక నల్లధనం విషయానికి వస్తే రోడ్డు మీద ట్రాఫిక్ కానిస్టేబుల్ నుండి బడా కంపెని వ్యాపారుల వరకూ తమకు సాధ్యమైనంత మేర నల్లధనం (పన్ను కట్టని సొమ్ము ) నిలవచేసుకోవదానికే ప్రయత్నిస్తున్నారు. పోనీ ఈ రోజు చేసిన పరిణామం వల్ల పూర్తిగా నల్లధనం నిరోధం జరుగుతుందా అంటే జరగదు పైగా ఇంక ఎక్కువ అవుతుంది. ఎలాగంటారా?? ఇప్పుడు లావాదేవీ జరిపే ప్రతీ దానిపై నిఘూ ఎక్కువ చేసారు, కానీ జనాలకు అంత నిజాయితీ గా ఉండడం కూడా ఇష్టం ఉండదు. జరిగే పరిణామం ఏంటంటే భవిష్యత్తులో నోట్లు ఎక్కడో పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి రానవసరంలేదు ,కొన్నాళ్ళు తర్వాత ఇప్పుడు విడుదల చేసిన కొత్త నోట్లను దశల వారీగా దేశంలోనే ముద్రించడం మొదలుపెడతారు .ప్రతీ రంగంలో ఇచ్చే వాడు పుచ్చుకునే వాడు కూడా ఒక అవగాహనతో లావాదేవీలు జరుపుతూ మళ్ళి నల్లధనం పెరుకోవడం మొదలవుతుంది. నిఘా ఎక్కువ ఉంది కాబట్టి, అసలు నోట్లతో కంటే నకిలీ నోట్లతోనే ఎక్కువ లావాదేవీలు జరిగే అవకాసం ఎక్కువ ఉంది.
ఇక్కడ మోడీ కావాలనే వదిలేసిన తెలివైన పని ఏంటంటే నోటు మీద ముద్రించిన సంవత్సరం ఉంటుంది, కానీ ముగింపు సంవత్సర్రం ఉండదు. అది ఉంటె ఇప్పుడు అధికార పక్షం వాళ్ళ ఆటలు కూడా సాగవు.ఈ ప్రపంచంలో ప్రతీదానికి జీవిత చక్త్రం ఉంటుంది ఒక్క కరెన్సీ కి తప్ప. దానికి కూడా ముగింపు తేదీ ఉంటేనే దానికి అసలు జీవితం ఉన్నట్లు లెక్క.
నోటు మీద ముగింపు తేది ఉండడం వల్ల కలిగే ముఖ్యమైన రెండు లాభాలు.
ఒకటి, ప్రతీ సంవత్సరం తాము ఎంత విలువగల నోట్లు ఎన్ని ముద్రణ చేసామో ఒక అంచనా ఉంటుంది. ఉదా : ఒక నోటు జీవిత కాలం ఐదు సంవత్సరాలుగా నిర్ణయించి 2000/- విలువగల నోట్లు ఒక లక్ష విడుదల చేసారే అనుకోండి. ఆ నోట్ల జీవితకాలం ముగిసేసమయానికి దగ్గరలో ఉన్న ఆయా బ్యాంకులలో మార్చుకునే అవకాసం ఎలాగు ఉంటుంది . అప్పుడు లక్ష కన్నా ఎక్కువ నోట్లు కనుక బ్యాంకులకు చేరితే , పెరిగిన నోట్ల సంఖ్యను బట్టి, దొంగనోట్ల ముద్రణ ఎంత మేరకు పెరిగింది అనేదానిపై సరైన అంచనా ఉంటుంది.
రెండోది ,ఏ ఒక్కడు కూడా ఒక పరిమిత కాలానికి మించి నల్లధనం దాచాలేడు,
సెల్ ఉన్న ప్రతీ మనిషికి కూడా బ్యాంకు ఖాతా తప్పని సరి చెయ్యాలి ,ఇప్పుడు సెల్ లేని సాధారణ మనిషి లేదు కాబట్టి పెద్ద నోట్లతో చెల్లించాల్సిన లావాదేవీలను ఆన్లైన్లో జరిగేలా చర్యలు తీసుకోవాలి.
ట్రాఫిక్ పోలీసు దగ్గర నుండి, కోర్టు చెల్లింపుల వరకూ కూడా వర్చ్యువల్ చెల్లింపుల విధానం అమలుచెయ్యాలి.
ఇలాంటి సులభమైన విధానాలు అమలు చెయ్యనంత వరకూ మీరు ఇప్పుడు చేసిన పని , కేవలం అధికార పక్షం, వారి ఆశ్రిత పక్షం వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుని అంతా సర్దుకుని , రాజకీయ ప్రత్యర్ధులను, వారి నల్లదన నిల్వలను దెబ్బతీయడానికే ఈ ఎత్తుగడ వేసారు అని అనుకోవడానికి ఎక్కువ అవకాశం కల్పిస్తుంది.

No comments