Tuesday, November 15, 2016

పెళ్ళంటేనే వరకట్నం

మనకి అందరూ నిజాయితీ పరుల్లానే కనబడతారు ! కానీ కాదు !! మనం బుద్ధిమంతుడైన అబ్బాయి పెళ్ళి కి వెళ్ళాం అనుకుంటాము ! కానీ కాదు !! ఎవరు ఎక్కువ... thumbnail 1 summary


మనకి అందరూ నిజాయితీ పరుల్లానే కనబడతారు !
కానీ కాదు !!
మనం బుద్ధిమంతుడైన అబ్బాయి పెళ్ళి కి వెళ్ళాం అనుకుంటాము !
కానీ కాదు !!
ఎవరు ఎక్కువ కట్నం యిస్తే ఆ యింటి పిల్ల నే పెళ్ళికి ఒప్పందం పడే
వారు ....,నిజాయితీ పరులెలా అవుతారు ?
ఎక్కువ కట్నం కోసం పెళ్ళి చూపులప్పుడే పది మంది అమ్మాయిల్ని
చూసేసి, చివరికి అధిక కట్నం తెచ్చే అమ్మాయి నే ఖాయం చేసుకున్న
వాడు ... , బుద్దిమంతుడు ఎలా అవుతాడు ?

* పెళ్ళంటేనే వరకట్నం !!!
చచ్చు పుచ్చు గాళ్ళు, ముదర గాళ్ళు విరివిగా అమ్ముడు పోయే ఎడ్ల
బజారు లాంటి వరుళ్ళ సంత !
పెళ్ళి కూతుర్ల తల్లిదండ్రులకు తమ తాహతుకు తగ్గట్టు అల్లుళ్ళ ని
కొనుక్కో వచ్చు !
మధ్యలో దళారీలు, బ్రోకరు గాళ్ళు వుండనే వున్నారాయే !

* ఎవడైనా ధైర్యంగా ' నేను కట్నం తీసుకో లేదని ' శుభలేఖ పై
ప్రచురించుకుని తన వివాహానికి ఆహ్వానించ గలడా ? అటువంటి
శుభలేఖ ఎప్పుడైనా చూడ గలమా ?
* 99 % మనం నేరస్థుల పెళ్ళిళ్ళ కి వెళ్తున్నాము !
ఇది నిజం !!
కళ్యాణ మండపంలోకి అడుగు పెట్టే ముందు ఒక్క సారి ఆలోచిద్దాం ...
ఇది నేరస్థుల పెళ్ళి కాదు కదా ? అని.
*** వరకట్న రాహిత్య సమాజాన్ని నిర్మిద్దాం !!!

శివశేఖర్ కాలెపు ధన్యవాదాలు  సర్

No comments