Saturday, November 12, 2016

ఫేస్ బుక్ స్వామీజీ సూక్తులు :వఝ్ఝల నాగేంద్ర వరప్రసాద్

(1) నువ్వూ , నీ పోస్టులూ లేకపోతే Mark Zuckerberg కు అసలు జీవితమే లేదు అనుకోకూడదు.... (2) నేను మాత్రమే మేధావిని అనుకొని పోస్టులు పెట్ట... thumbnail 1 summary


(1) నువ్వూ , నీ పోస్టులూ లేకపోతే Mark Zuckerberg కు అసలు జీవితమే లేదు అనుకోకూడదు....
(2) నేను మాత్రమే మేధావిని అనుకొని పోస్టులు పెట్టకూడదు
(3) నువ్వు పోస్టులు పెట్టకపోతే ఎవ్వరికీ ఎలాంటి నష్టమూ ఉండదు
(4) నా పోస్టులకు మాత్రం అందరూ లైక్ లు పెట్టాలి నేను మాత్రం ఎవరికీ లైక్ లు పెట్టను అని మాత్రం నువ్వు అనుకోకూడదు
(5) నువ్వు కామెంటులు చేసేటప్పుడు చిన్నా , పెద్దా , ఆడా , మగా తేడా తెలుసుకొని...సభ్యతా సంస్కారంతో కామెంటు చెయ్యాలి అంతేకానీ నోటికొచ్చినట్టు చెత్తగా రాయకు
(6) నువ్వు పబ్లిక్ పోస్టు పెట్టి , కామెంటులు మాత్రం ఒకరూ ఇద్దరితో మాత్రమే చాటింగులా చెయ్యకూడదు
(7) ఎదో కొద్దిమంది నీ పోస్టులు ఫాలో అయినంత మాత్రాన నీ కళ్ళు నెత్తికెక్కకూడదు
(8) నీకు కొద్దిమంది ఫ్రెండ్స్ మాత్రమే నచ్చితే వాళ్ళతో కలిసి ఒక గ్రూప్ పెట్టుకో ....అక్కడ నీకు నచ్చినట్టు భజన చేయించుకో
(9) ఎవరైనా ఫ్రెండ్ నీకు నచ్చలేదూ అనుకో అన్ ఫ్రెండ్ చేసుకో లేదా బ్లాక్ చేసేసుకో ....
అంతేకానీ వాళ్ళగురించి చెత్త చెత్తగా వ్యాసాలు , ఉపన్యాసాలు వద్దు
* కనీసం ఈ కొద్దిపాటి జాగ్రత్తల వల్ల నువ్వూ నీ ఫెండ్స్ కూడా సంతోషంగా ఉండచ్చు....
ఆలోచించుకో నాయనా......

No comments