Tuesday, November 22, 2016

పుట్టుకతో స్త్రీ కి వచ్చే సౌభాగ్యం పోకడ తోనే పోవాలి.

మీరు చూస్తూన్న యీ చిత్రాలు --- మధుర లోని బృందావనంలో తల దాచుకుంటూ , భజనలు చేసుకుంటూ ఆ గుడి వారు దానంగా విదిల్చిన ఫలహారాన్ని ఆహారంగా స్వీ... thumbnail 1 summary

మీరు చూస్తూన్న యీ చిత్రాలు ---
మధుర లోని బృందావనంలో తల దాచుకుంటూ , భజనలు చేసుకుంటూ ఆ గుడి వారు దానంగా విదిల్చిన ఫలహారాన్ని ఆహారంగా స్వీకరిస్తున్న 4000 మంది వితంతులవి !
అమ్మ ఎదురొస్తే మంచి అనుకునే ఓ కొడుకు , అదే అమ్మ , నాన్నను కోల్పోతే ... విదవరాలైందని తలచి ,ఆ అమ్మే ఎదురును అశుభంగా భావిస్తాడు.
మధ్యలో వచ్చి మధ్యలో పోయాడు నాన్న !, ఎప్పుడో ఆటవిక యుగం లో మూర్ఖుడు పెట్టిన మూఢాచారాలకే ఎక్కువ ప్రాముఖ్యతని యిస్తున్నాము .
స్త్రీ కి ఎంతో విలువను యిస్తున్నామని డప్పు కొట్టుకుంటున్న యీ భారతా వనిలో వితంతువుకు యిచ్చే గౌరవం ఏ పాటిదో అందరికీ తెల్సున్న విషయమే!!
అసలు వితంతువు అంటే ఏమిటి ?
ఒకానొకప్పుడు--- భర్త మరణిస్తే ఆమెను కూడా చితిలోకి తోసి చంపేసేవారు
ఆ తర్వాత కాలంలో గుండు గీసి తెల్ల చీర కట్టి, మూల కూర్చో పెట్టే వారు
బొట్టూ, కాటుక, గాజులు ,పూలు మరియూ యితరాత్ర సౌభాగ్యాలతో కళ కళ లాడే ఆ స్త్రీ ని అంధ వికారురాల్ని చేయడమేనా ?
ఒక స్త్రీ పట్ల మగ జాతికి ఆ అధికారాన్ని ఎవరు యిచ్చారు ? అసలు అటువంటి హక్కు పురుష ప్రపంచానికి వుందా ?
ఆడ -- మగ యీ సృష్టి కి యిద్దరూ సమానులే. వీరే లేక పోతే సృష్టి కార్యమే లేదు. మనం లేము. మనం అనుకున్నది ఏ ఒక్కటీ లేదు.
అటువంటిది --- స్త్రీ అంటే మగ జాతి ఎందుకు అంత చులక గా చూస్తున్నది ?
ఆలోచిస్తే తప్పుగానే వుంది ? వారి పట్ల యీ పురుషులు తప్పు చేస్తున్నట్లు అనిపించడం లేదూ ?
తను వున్నంత కాలం తన భార్య తనకు అణుకువగా, ,అవసరాలు తీర్చే బొమ్మలా వుండాలనా యీ మగాడి వుద్దేశ్యం ? తనకు మాత్రమే అందంగా కనిపించాలనే మరో కోరిక తో వుంటున్నాడా ?
పోయే వాడు ఎలానూ పోతాడు ... భార్యకు సౌభాగ్యాన్ని దూరం చేయడం ఏమిటి ?
స్టేజీలు ఎక్కి అడ్డమైన వుపన్యాసాలు వాగే నారీమణులు, పత్రికల్లో తమ కలం ప్రతాపం చూపే రచయిత్రులు, టి.వి ల్లో హొయలు పోతూ మాట్లాడే మహిళలకు యీ వితంతు ఘోరం అర్ధం కావడం లేదా ?
ఇంత వరకూ ఏ స్త్రీ దీన్ని ఖండిచ లేదు. ఇది సాటి ఆడదానికి జరుగుతున్న నీచమైన అన్యాయం అని ఏ కోర్టు లోనూ వ్యాజ్యం వేయబడ లేదు.


మరి ! ఇంకెంత కాలం వితంతు సాంప్రదాయాన్ని కొనసాగించాలి ?
మీరే ఆలోచించండి!
ఆటవిక యుగం నుండి ఆధునిక యుగం లోకి వచ్చాం .... యింకా యివన్నీ అవసరమా ? ఇంకా యిలాగే ప్రవర్తిస్తే యావత్ స్త్రీ జాతినే అవమానించి నట్లౌతూంది .
మన అమ్మ ఎప్పటికీ విధవరాలు కాదనే భావనలోనే వుందాం ! నాన్న మరణించినా ఆయన జ్ఞాపకాలు ఎన్నటికీ సజీవంగా మన యింట వుంటాయి.
విధవ సంస్కృతిని ఎంత త్వరగా వదిలించుకుంటే, అంత పచ్చగా యీ భారతావని కళకళ లాడుతూంటూందని .....మరవకండి ..మర్చిపోకండి !!
ఇక ముందు ఏ యింటా ఏ స్త్రీ కూడా విధవరాలు గా వుండ కూడదు .
పుట్టుకతో స్త్రీ కి వచ్చే సౌభాగ్యం పోకడ తోనే పోవాలి.
sekharviews. com-----శివశేఖర్ కాలెపు

No comments