Thursday, December 22, 2016

నల్లధనం అరికడుతున్న విధానంతో ముచ్చట పడి................ప్రసాద్ చరసాల

నల్లధనం అరికడుతున్న విధానంతో ముచ్చట పడి అలాగే మరిన్ని కార్యక్రమాలని ఎలా అమలు చేయవచ్చో కదా అని నా బుర్రకు ఇలాటి అయిడియాలు వచ్చాయి. ఆరుబ... thumbnail 1 summary


నల్లధనం అరికడుతున్న విధానంతో ముచ్చట పడి అలాగే మరిన్ని కార్యక్రమాలని ఎలా అమలు చేయవచ్చో కదా అని నా బుర్రకు ఇలాటి అయిడియాలు వచ్చాయి.
ఆరుబయట మల విసర్జనను నిషేదించడం.
ఓ అర్ధరాత్రి అకస్మాత్తుగా ప్రకటించాలి ఆ మరుసటి వుదయం నుండీ ఎవరూ మల విసర్జనకి ఇల్లుదాటి వెళ్ళ కూడదని. వూర్ల చుట్టూ కాపలా పెట్టి బయటకు వెళ్ళేవాళ్ళ మీద నిఘా పెట్టాలి. పాత కాలం నాటి ప్రమాణాలు లేని కక్కసు దొడ్లు కేవలం రెండు నెలల వరకే, అవి కూడా పరిమితంగా వుపయోగించాలి.
రెండురోజుల్లో ప్రభుత్వమే అక్కడక్కడా పదివేల జనాభాకి ఒకటి చొప్పున కొత్త కక్కసు దొడ్లను కడుతుంది. ప్రజలంతా కేవలం వాటినే వాడాలి. లేదా వాళ్ళింట్లో కొత్త కక్కసు దొడ్డి కట్టించుకోవాలి.
రెండో రోజునుండీ కేవలం కక్కసు దొడ్లని రోజుకు కేవలం అయిదునిమిషాలు మాత్రమే వాడుకునే వెసులుబాటు కల్పించాలి. అదికూడా రెండు నెలలు మాత్రమే. ఆ తర్వాత పాత దొడ్లను పూడ్చేయడం జరుగుతుంది.
ఈ కొత్త దొడ్లముందు క్యూ కట్టి కొందరు దేశభక్తి లేని వారు ఛస్తారు. చావనివ్వండి. దేశ సరిహద్దుల్లో సైనికులు చావటం లేదా? పరిశుద్ద భారత్ కోసం ఆమాత్రం పరిణితి, బాద్యత, ఓపిక ప్రతి పౌరుడూ చూపిస్తాడు.
త్వరలో మోదీ గారు దీన్ని ఆచరణలో పెట్టాలని ఆశిస్తున్న దేశభక్తుడు.

No comments