Wednesday, December 21, 2016

దేశం లో ఎల్లుండినుండి "దంగల్" పడనున్నారు..!--గొట్టిముక్కల కమలాకర్

దోచుకోబడడానికి సిద్ధం అవుతున్నా .. మా ఊరికి వెళతా .. నాన్న చింత బరిక తో వీపు పగలేసిన ఘటనలనీ, మనని కాపాడబోయి అమ్మ తిన్న చీవాట్లనీ నెమర... thumbnail 1 summary

దోచుకోబడడానికి సిద్ధం అవుతున్నా ..
మా ఊరికి వెళతా ..
నాన్న చింత బరిక తో వీపు పగలేసిన ఘటనలనీ,
మనని కాపాడబోయి అమ్మ తిన్న చీవాట్లనీ నెమరేసుకుంటా ..
తొలకరి జల్లు లో తడిసిన మట్టి వాసనని నిండుగా ఆఘ్రాణిస్తా ..
ముర్రు పాల నురుగు మూతికంటిచుకుంటా ..
ఆడపిల్లైన పాపానికి చదువు కోల్పోయిన చిన మేనత్త కోసం ,
జీవితం కోల్పోయిన పెద్ద మేనత్త కోసం లక్షోసారి గుండె తడి చేసుకుంటా ..
నానమ్మ కొంగు లోనుండి కొట్టేసిన పావలా తో కొన్న జీళ్ళ రుచి జ్ఞాపకం చేసుకుంటా ..
నాన్నా..
చెప్పకుండా ఈత కొట్టి నీతో తిన్న ఈత బరిక దెబ్బలు;
బ్రాహ్మడినై పుట్టి, చేపలు పట్టినందుకు చింత బరిక దెబ్బలు;
అన్నింటినీ ఆమీర్ ఖాన్ ట్రైలర్ తోనే గుర్తుచేస్తున్నాడు...
సినిమా చూస్తే, మళ్ళీ ఊరొచ్చేస్తానేమో ...

No comments