Wednesday, December 21, 2016

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందంటే ఇదే...ఘంటసాల శ్రీనివాస్

 రోమానియా దేశంలో ప్రాచుర్యం పొందిన ఒక కధ ఉంది.. ఆ దేశంలో రాజు వృద్దులు అందర్నీ చంపేయమని  ఆదేశిస్తాడు , ఎందుకంటే వృద్ధులతో దేశంకి ఏమి ఉప... thumbnail 1 summary


 రోమానియా దేశంలో ప్రాచుర్యం పొందిన ఒక కధ ఉంది.. ఆ దేశంలో రాజు వృద్దులు అందర్నీ చంపేయమని  ఆదేశిస్తాడు , ఎందుకంటే వృద్ధులతో దేశంకి ఏమి ఉపయోగం లేదని...ఒక కొడుకు తన తండ్రిని చంపొకోలేక దాచిపెట్టి ఉంచుతాడు, అతని మాట కొడుకు వినటం వాళ్ళ దేశం కరువునుంచి రక్షింపబడుతుంది  .. తర్వాత రాజుకి తేలుస్తుంది ఈ విషయం , రాజు అడగటం , కొడుకు చెప్పటం... కధ సుఖంతం ...
.
ఈ ఉఫోద్ఘాతం అంత ఎందుకంటే...
.
మోడీగారి ముద్దుబిడ్డ పాలసీ బ్లాక్ మనీ నిర్ములన, #క్యాషులెస్ఎకానమీ,  బొంగు బోషాణంతో మనదేశంలో కూడా అదే పరిస్థితి వస్తుందేమో అని భయం వేస్తోంది..
.
ఇంతకు ముందు దేశంలో రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులకివారి సేవలకు గుర్తింపుగా, వాళ్ళు వయసుమల్లక కష్టపడలేరు, వాళ్ళ జీవనాధారం కోసమని పెన్షన్ ఇచ్చేవారు..ఏప్రిల్ ఫస్ట్ 2004 నుంచి మనదేశంలో పెన్షన్ పధకాలు ఏవో కొద్దీమందికి తప్పిస్తే చాలామందికి ఎత్తివేయటం జరిగింది..ఆ తర్వాత రిటైర్ అయినా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగస్తులు వాళ్ళపాట్లు  ఏవో వాళ్ళు పడటమే బ్రతుకుబండి లాగటానికి..అయితే ఈ ఉద్యోగాస్తులు చాలామంది తమ పొదుపుమొత్తంని పెంచుకుంటూ, ఖర్చులు తగ్గించుకుంటూ కొంత సొమ్ము వేనేకేసుకోస్తున్నారు .. అది ప్రోఫిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ కానివ్వండి, ఇన్సూరెన్సు  పోలిసిస్  , మ్యూచువల్ ఫండ్స్, షేర్స్, పోస్ట్ఆఫీస్ సేవింగ్స్ , బ్యాంకు సేవింగ్స్.. ఎందుకంటే వాళ్ళు ఇక కష్టపడలేని సమయానికి ఆ సొమ్ము వాళ్ళ చేతికి అందివచ్చి దాని మీద వచ్చే వడ్డీతో ఎలానో ఒకలా బ్రతకొచ్చు అని...
కానీ ఇప్పుడు మోదీగారి దయవల్ల వాళ్ళందరి బ్రతుకులే కాదు, ఇప్పుడు 40 + వయసులో ఉన్నవాళ్లు కూడా ప్రమాదంలో పడ్డారు...దేశంలో ఉన్న సొమ్ము అంత బ్యాంకులు దగ్గర ఉంటె బ్యాంకులు ఎక్కువ వడ్డీలు ఇవ్వవు..ఇప్పటికే మన దేశం లో డిపోసిట్స్ మీద ఇచ్చే వడ్డీలు బాగా తగ్గిపోయాయి, దేశం అభివృద్ధి చెందాలంటే రుణాలు తక్కువవడ్డీకి ఇవ్వాలి..ఆలావాళ్ళకి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చినప్పుడు డిపాసిట్లు మీద ఎక్కువ వడ్డీ ఇవ్వటం కుదరదు అని..ఇప్పుడు ఈ చేష్టవాళ్ళ ఇంకా దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయేమో బ్యాంకులు ఇచ్చే వడ్డీ విషయంలో...బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తే ఆటోమేటిక్ గా తక్కిన అన్ని సంస్థలు తగ్గించేస్తాయి ..తక్కిన దేశాలలోలా మన దేశంలో పెన్షన్ ఫండ్స్ పై కట్టుదిట్టమైన రూల్స్ అంటూ ఏమి లేవు.. మన దేశం లో పెన్షన్ లేని వాళ్ళకి బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ వడ్డిలే దిక్కు చాలా వరకు...ఎలానో మన ప్రభుత్వాలకి ధరల పెరుగుదల , inflation తగ్గించటం చేత కాదు, దానికి తోడు ఈ బంపర్ ఆఫర్ ఒకటి ఉచితం .  మోడీ గారు ఇక వృద్ధుల అవసరం దేశంకి అవసరంలేదు అని చెప్పకనే చెప్పారు...ఇక దేశంలో వృద్ధులు ఎలా బ్రతకాలో  భక్త మహాశయులు సెలవిస్తే వినాలని ఉంది..
.
ఎత వాత చెప్పొచ్చేది ఏంటంటే ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందంటే ఇదే...

No comments