Wednesday, December 21, 2016

ఆముక్తమాల్యదపై ఒక సామాన్యుడి సమీక్ష.-రెండవ భాగం--మల్లారెడ్డి దేశిరెడ్డి

శ్రీకృష్ణదేవరాయల వారి ఆంధ్ర పంచ కావ్యం. ఆముక్తమాల్యదపై ఒక సామాన్యుడి సమీక్ష.-రెండవ భాగం రెండవ భాగం ◆◆◆◆◆◆◆ ఆముక్తమాల్యదలోని ముఖ్య ... thumbnail 1 summary

శ్రీకృష్ణదేవరాయల వారి ఆంధ్ర పంచ కావ్యం.
ఆముక్తమాల్యదపై ఒక సామాన్యుడి సమీక్ష.-రెండవ భాగం

రెండవ భాగం
◆◆◆◆◆◆◆

ఆముక్తమాల్యదలోని ముఖ్య ఘట్టాలు  ::
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

శ్రీవిలుబుత్తూరు పుర వర్ణనము ::
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

పాండ్య రాజ్యము యొక్క రాజధాని మధుర.
అందలి ముఖ్యనగరం శ్రీవిలిబుత్తూరు పురం. ఆకాశాన్ని తాకినట్లుండే అంతఃపురాలు,వాటి ఉద్యానవనాల్లో ఎటువైపుచూసినా కోయిలల కిలకిలా రావాలు.ఒక చోట ఊరి వర్ణన చేస్తూ చెరువులయొడ్డున బాతులు తలలు వెనుకకు మలచి రెక్కలలో చొనిపి నిద్రపోగా స్నానము చేయుచున్న బ్రహ్మణులు తమ వస్త్రములను పిండి యుండలుగా పెట్టినట్లుండునట. క్రింది
పద్యంలో వర్ణన చూడండి.

తలఁ బక్షచ్ఛట గ్రుచ్చి బాతువులు కేదారంపుఁ
గుల్యాంతర

స్థలి నిద్రింపఁగఁ జూచి యారెకు లుష
స్స్నాత ప్రయాతద్విజా

వలి పిండీకృత శాటిక ల్సవి దదావాసంబుఁ
జేర్పంగ రే

వుల డిగ్గ నేస్వఁ బాఱువానిఁ గని నవ్వు       న్శాలిగోప్యోఘముల్.

ప్రథమాశ్వాసము - 65.  [ 3వ పద్యం ]

ఇళ్ళ ద్వారాల మీద ఏనుగులను కొలనులో జలకాలాడిస్తున్న లక్ష్మీదేవి బంగారు చిత్రాలు. ద్వారాల మెట్లకి ఏనుగులు,సింహాలా యొక్క బొమ్మలు.ప్రతి ఇంటికి ద్వారబంధములకు రెండు వైపుల శంఖుచక్రములుండును.

ద్రవిడాంగనల పోఁడుములు ::
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

శరీరాలకి బంగారు పూత  పోసినట్లుగా,తమ శరీరాలకి పసుపు పూసుకుని కొలను నందు స్నానమాచరించి, శ్రీహరి పూజకోసం బిందెల్లో నీళ్ళు నింపుకుని చేతుల్లో తామరపూలతోటి ద్రవిడస్త్రీలు తమ వయ్యారాలు ఒలకబోస్తూ, ఒక వైపు గానం చేసుకుంటూ ఉద్యానవనము దారిలో వెళ్ళుచున్నపుడు చేసిన వర్ణనను ఈ క్రింది పద్యంలో చెప్పాడు.

శాయ పూజాంబుజముల్ ఘటిం దడఁబడన్,
జన్ధోయి లేఁగౌనుపై

దయఁ దప్పన్ బసుపాడి,పాగడపుఁ బాదంబొప్పఁ,జంగల్వడి

గ్గియ నీ రచ్యుత మజ్జనార్దము గటిం గీలించి,
దివ్య ప్రబం

ధయుగాస్యల్ ద్రవిడాంగనల్ నడుతు
రుద్యానంపులో త్రోవలన్.

ప్రథమాశ్వాసము - 56.   [ 4వ పద్యం ]

అరుగులమీద కూర్చుని ఉల్లాసంగా పాచికలు ఆడుతున్న ద్రవిడ స్త్రీలను వర్ణించిన తీరును ఒకసారి చూడండి ఎలా వుందో, సన్యాసికైనా గుండె జల్లు మనిపించేది సారె విసిరేటప్పుడు వాళ్ళ కంకణాల చప్పుడు విని, మన్మథుడే ఎదురుగా వచ్చినా పట్టించుకోనిది వాళ్ళ ఆట తన్మయత్వం, ఇంద్రుడినైనను సరే అక్కడికి లాక్కొచ్చేది భక్తులను చూడటం తోటే ద్రవిడ స్త్రీలు లేచి వాళ్ళు పెట్టే నమస్కారభంగిమ, పురవీధిలో జనం గుండెలను కోసేవి ఆలయం నుంచి వచ్చే శంఖనాదం వినటానికి ఆ స్త్రీలు తమ తలలను తిప్పినప్పుడు అతి వేగంగా పయనించే వాళ్ళ కళ్ల కొనచూపులు. ఇక వాళ్ళు మాంచి ఊపుగా పాచికల్ని వేస్తూంటే ఆ ఊపుకి జారిన పైటని తమ రెండో చేత్తో సర్దుకునే దృశ్యం చూడ కలిగిన వాళ్ళు ధన్యులు!అంటూ వర్ణించారు,ఈక్రింది చూపిన
రెండు పద్యములలో రాయల వారు ఇలా చెప్పాడు.

సవలయధ్వని గాఁగ సారె వ్రేయు నదల్పు
              యతినైన గుండె జల్లనఁ గలంప,

సుడిపిన మొగమెత్తి చూడకుండు పరాకు
      కుసుమబాణుని నైనఁ గువిటుఁ జేయ,

శ్రీకార్య పరులఁ  గాంచిన లేచి మ్రొక్కు నం
           జలికి నింద్రుండు నక్కొలువుఁ గోర

హరిగృహావసరశంఖాకర్ణకుఁ ద్రిప్పుఁ
              గడగంటి జిగి ప్రజఁ గాఁడి పాఱఁ.

ప్రథమాశ్వాసము - సీ 59. [ 5వ పద్యం ]

గవఱ లుంకించి వ్రేయఁ గొ ప్పవియ నవలి

కరమున సమర్పఁ బైఁటలో మరుని బటువు

బిల్లక్రియఁ బట్టుఁగంచెలఁ బిగువుఁ జన్ను

నిక్కఁ దిన్నెలఁ బాత్రముల్ నెత్తమాడు.

 ప్రథమాశ్వాసము - 59. [ 6వ పద్యం ]

వెలయాండ్ర విలాసములు ::
■■■■■■■■■■■■■■

వేశ్యలు సౌందర్యవతులే కాదు తమ చూపుల తోటే ఎవరి కులమైనా చెప్పే లోకజ్ఞానం వారికి
సొంతం. రాజుకు రెండో అంతఃపురంలా ఉండే నివాసములు,సౌభాగ్యం,అంతేగాదు వేశ్యలు పలు భాషలలో చాలా చక్కని కవిత్వం కూడా  చెప్పగలిగే పాండిత్యం కలవారు.

విష్ణుచిత్తుడు కథ ::
◆◆◆◆◆◆◆◆◆

విలుబుత్తూరులో వెలసిన దైవం మన్ననారు,
ఆయనే సాక్షాత్తూ విష్ణుమూర్తి.స్వామిభక్తులు ఎవ్వరైనా ఆ ఊరికి వస్తే చాలు వాళ్ళకి ఎంతో భక్తిశ్రద్దలతో మంచి ఆతిథ్యం ఇస్తారు ఆ వూరి వాళ్ళు. అలాంటివారిలోనే విష్ణుచిత్తుడనే ఒక మహాభక్తుడు ఆవూరి భాగవతుల్లో అత్యంత ఉత్తముడు.శ్రీహరిని ప్రతి నిత్యం పూజిస్తాడు. ప్రతి క్షణం తన ఇష్ట దైవమైన శ్రీహరిని తన హృదయంలో ధ్యానిస్తుంటాడతను. అతను
గొప్ప అన్నదాత.

విష్ణుచిత్తుడి ఇంటిలోన అర్థరాత్రైనా కూడా అతిథులకి భోజనాలు పెట్టేవాడని, ఎంతటి
అర్థరాత్రివేళైనా సరే అతనింట్లో మహావిష్ణువు పుణ్యకథా కీర్తనం,ద్రవిడ వేదాల పారాయణం వీటితోపాటు కూరలెక్కువగా లేవు, అన్నము చల్లారిపోయినది, పప్పు లేదు, అన్నం కూడ ససిగా లేదు,దయచేసి భోజనం చేయవలెనని మాటలు వినిపిస్తుంటాయట, అనేది ఈ క్రింది పద్యం ద్వారా అర్దమైతుంది.

అనిష్టానిధి గేహసీమ నడురే యాలించిన
న్ర్మోయు నెం

తే నాగేంద్రశ యానుపుణ్యకథలుం దివ్యప్రబంధాను సం

ధానధ్వానము, “నాస్తిశాకబహుతా,                    నా స్య్తుష్ణతా, నాస్తపూ

పో, నాస్య్తోదనసౌష్టవంచ,కృపయాభో                 క్తవ్య " మన్పల్కులున్.

నాస్తి దగ్గర నుండి సంస్కృతం.

ప్రథమాశ్వాసము - 84. [ 7వ పద్యం ]

ద్వితీయాశ్వాసములో కవి రాయల వారు విలుబుత్తూరును వదిలివేసి పాండ్యరాజ్యం రాజధాని మధురని తీసుకున్నాడు.అప్పటి పాండ్యరాజ్య రాజు చంద్రవంశభూషణుడైన మత్స్యధ్వజుడు.ప్రతి వేసవికాలంలో మధుర దగ్గరలోనున్న వృషగిరి అనే ఊరులో ప్రజలు తెప్ప తిరునాళ్ళు ఉత్సవం ఘనంగా చేస్తారు. అచటొక పురాతన వైష్ణవాలయం యున్నది.
[ కొన్ని ముద్రిత పుస్తకాలలో వీటిని అళఘరి సుందరబాహుస్వామి తెప్ప తిరునాళ్ళు అని
కూడా చెప్పారు.]

ఒక పరదేశి బ్రాహ్మణుడు తెప్ప తిరునాళ్ళను చూచుటకు పోయి, పక్కనే యున్న రాజధాని మధురను కూడా చూసి,ఆచటి  వైగై నదిలో
స్నామాచరించి ఒక పురోహితుడి ఇంటిలో విడిదిచేసి అతని ఆతిథ్యంలో భోజనం చేసి, తన వూరికి ప్రయాణమయ్యేడు. రాత్రిపూట దారిలో మధురలో ఒక అరుగు మీద మిగిలిన బాటసారులతో కలిసి,విడి దుస్తుల మూటను తలగడగా తలక్రింద పెట్టుకొని పడుకుని,నిద్ర రాక, నిదుర పోవుటకు కాలక్షేపం కోసం కొన్ని సుభాషిత పద్యాలు పాడటం మొదలెట్టేడు.
సరిగ్గా అదే సమయంలో మత్స్యధ్వజ రాజు తన భోగిని దగ్గరికి బయల్దేరేడు.[రాజుకి ఒక యుంపుడుకత్తె యుండెను] సరిగ్గా రాజు ఆ
బ్రాహ్మణుడు నిద్రించు చోటుకి చేరినప్పుడు,
ఆ బ్రాహ్మణుడు ఒక పద్యం చదువుచుండెను,
ఆ రాజు విన్న పద్యంలోని తాత్పర్యమిది,అది
“వానకాలములో భోజనమునకు వానలు లేనప్పుడు సంపాదించు కొనవలయును, రాత్రి భోజనమునకు పగలు సంపాదించు కొనవలయును,ముసలితనములో ఎలాగూ సంపాదించ లేము గనుక యవ్వనంలోనే సంపాదించి నిల్వ చేసుకొనవలెను,చచ్చి పోయిన తరువాత పరలోకమున్నది , అది యెట్టిదో తెలియదు,మరి దాని కోసం బ్రతికి యున్నప్పుడే కొంత పుణ్యమును కూడా ప్రోగు చేసుకొనవలెను."

రాజుకి బ్రాహ్మణుడు పద్యంలోని తాత్పర్యం గునపంతో గుండె లోతులలో గ్రుచ్చినట్లుగా తగిలేసరికి రాజు తన స్థితిని తల్చుకునే సరికి దుఃఖం వచ్చింది.వెంటనే రాజు దుఃఖం నుంచి తేరుకొని గొప్పచక్రవర్తుల్నీ ,మహామహాలును  కూడా ఒకఏట్లో నావలా కదిలీ కదల్నట్టు కదిలి కాలం ఎలా మోసం చేసిందో ఆలోచించుకొని,  క్షణికమైన రాజభోగం, ఉంపుడు కత్తెలతోటి సంబంధాల గురించి కాక, శాశ్వతమైన సత్యం మరియు మోక్షముల యొక్క పూర్తి మూలాల గురించి తెలుసుకోవాలని నిర్ణయుంచుకొని,
వెంటనే రాజు ఒక కానుకను తీసి తలారి చేత  బ్రాహ్మణుడికి యిప్పించి వెనక్కి తిరిగి తన అంతఃపురం వెళ్ళేడు.రాజు ఉదయముననే కొలువు తీరి విద్వాంసులందరిని పిలిపించి, వారితో శాస్త్రాలన్నీ చూసి మోక్షం వచ్చే ఏకైక మార్గం ఏమిటో కనుక్కుని చెప్పమన్నాడు. వాదంలో గెలిచి తనకు తత్వంను చెప్పగలిగే వారికి బహుమతిగా ఇచ్చుటకు రాజుగారు బీరపువ్వుల్లాటి బంగారునాణేల్ని జాళెములో పోయించి వేలాడదీయించాడు సభలో!


                                                    [ సశేషం ]

No comments