Wednesday, December 21, 2016

మంథా భానుమతి రచనా వ్యాసంగం--గణేశ్వరరావు

 రచనా వ్యాసంగం లోనికి ఆలస్యంగా దిగిన మంథా భానుమతి ఆ తరువాత ఆ అర్హతతో సాహిత్యరంగంలోకి అడుగుపెడతారు. క్రమం తప్పకుండా తమ పుస్తకాలను వెలువరి... thumbnail 1 summary

 రచనా వ్యాసంగం లోనికి ఆలస్యంగా దిగిన మంథా భానుమతి ఆ తరువాత ఆ అర్హతతో సాహిత్యరంగంలోకి అడుగుపెడతారు. క్రమం తప్పకుండా తమ పుస్తకాలను వెలువరిస్తున్న వారిలో ఆమె ఒకరు. 'అనంత వాహిని' వచ్చి కొన్ని ఏళ్ళయిన ప్పటికీ, నాకు facebook తో పరిచయం లేక, నాకు నచ్చిన ఆమె కథ 'చిన్నమ్మ' గురించి నా ఆలోచనలు పంచుకోలేకపోయాను. ఇది ఒక గొప్ప కథ, ఉదాత్త మైన పాత్ర ఉన్న కథ. ఈ మధ్యనే నా అమెరికా మిత్రులు గొర్తి భ్రహ్మానందం, మెడికో శ్యాం తో జరిపిన చర్చల్లో ఈ 'ఉదాత్తత' అంశం చోటుచేసుకొంది. పుంఖాలు పుంఖాలుగా రాస్తూన్న రచయితలున్నారు, వీళ్ళని పట్టించుకోకుండా, కేవలం ఒకటి రెండు సంపుటాలు వెలువరించిన రచయితలను - ప్రాచీన కాలంలో రాజును ఎన్నుకోమని పంపిన ఏనుగు తనకి ఎదురైన మొట్ట మొదటి వాడి మేడలో దండ వేసినట్లు - అకాడమీలు సత్కరించడంలో ఔచిత్యం ఉందా? అన్న ప్రశ్నకు నా మిత్రులు 'ఉదాత్తత' శబ్దాన్ని సమాధానంగా వాడారు. సాహితీ విలువలను సంతరించుకోవాలంటే ఆ రచనలో ఒక 'ఉదాత్తత' ఉండాలని అన్నారు. కాగా మంథా వారి కథలో - చెల్లెలి కోసం త్యాగం చేసిన 'చిన్నమ్మ' ఆ ఉదాత్తత ను చూపిస్తుంది. ఆమె డిస్లేక్సియా రోగి, రాయడం రాదు, అయితే బొమ్మలు వేయగలదు, ఇంటిని తీర్చి దిద్దగలదు, పిల్లల్ని పెంచగలదు. చెల్లెలే సర్వం అనుకుంటుంది, తన అవసరం పడి చెల్లెలు పిలిస్తే అమెరికా వెళ్లి ఆమె పిల్లల్ని తన కన్న పిల్లల్లా చూసుకుంటుంది, అవసరం తీరగానే చెల్లెలు అది గుర్తించక చిన్నమ్మ ను వెనక్కి పంపేస్తుంది, వెళ్లేముందు చిన్నమ్మ తన మనసులోని మాట ఒక ఉత్తరంలో రాసి పెట్టి వెళ్ళిపోతుంది. ఈ ప్రధాన కథలో ఒక ఉప కథ కూడా ఉంది, ఒక రైతు తన కావడిలో రెండు కుండల నీళ్ళు - ఒకటి మంచిది, రెండోది చిల్లి ఉన్నది - తెస్తుంటాడు, తన కుండలో నీరు కారిపోతూండగా చూసిన చిల్లి కుండ యజమానితో తనకు బదులు మరో మంచి కుండనే కావడి కి తగిలించాకూడదా అని అడుగుతుంది, మంచి కుండ నీళ్ళు తమకి మాత్రం సరిపోతాయని, కుండ చిల్లిలోంచి కారిన నేలలోని పూల మొక్కలకు కూడా పనికోస్తున్నాయని రైతు జవాబిస్తాడు. చిన్నమ్మ చూపించే నిష్కల్మషమైన ప్రేమ ఎంత ఉదాత్తమైనదో అమెరికా చెల్లెలికి, ఆమెతో పాటు మనకీ తెలిసొస్తుంది. మంథా భానుమతి ఈ కథను ఎంతో ఆర్ద్రతో సున్నితంగా, సుందరంగా కథిoచారు. ఈ సంపుతిలోనే ఉన్న మరొక మంచి కథ 'అనంత వాహిని, నేటి యువతీ యువకులను చైతన్యపరిచేది, మార్గాదర్సనం చేసేది..హైదారాబాద్ పుస్తక ప్రియులకి ఈ రెండు కథలు చాలు వాళ్ళ 'పైసా వసూల్' కి'.

No comments