Friday, December 23, 2016

ఆముక్తమాల్యదపై ఒక సామాన్యుడి సమీక్ష.---నాలుగో భాగం----మల్లారెడ్డి దేశిరెడ్డి

శ్రీకృష్ణదేవరాయల వారి ఆంధ్ర పంచ కావ్యం. ◆◆◆◆◆◆◆◆ యమునాచార్యుని కథ  :: ◆◆◆◆◆◆◆◆◆◆◆◆ శైవులు పై దూషణ. వర్షఋతు వర్ణన. ఒకచోట మన్ననా... thumbnail 1 summary

శ్రీకృష్ణదేవరాయల వారి ఆంధ్ర పంచ కావ్యం.

◆◆◆◆◆◆◆◆

యమునాచార్యుని కథ  ::
◆◆◆◆◆◆◆◆◆◆◆◆

శైవులు పై దూషణ.
వర్షఋతు వర్ణన.

ఒకచోట మన్ననారు స్వామి తన శ్రీమతియైన లక్ష్మీదేవికి యమునాచార్యుల కథను చెప్పిరి. ఇచట శైవమత దూషణం చాలా ఎక్కువగానే కనిపించును.

వర్ష ఋతువు వర్ణనలో కాపులను, రెడ్లను
దూషించెను.ఉదాహరణకి క్రింది పద్యములు.

వసతుల్వెల్వడి, వానకై గుడి సె మోవన్
రాక తా నానియే

వసగా నిల్చినజమ్ముగూడఁ బొల మంబ     ళ్ల్మోయుచుం బట్టి పె

న్ముసురం దీఁగెడుకాఁపుగుబ్బెతల పెన్గుబ్బ
ల్పునాస ల్వెలిం

బిసికిళ్ళుం బిసికిళ్ళు హాలికుల కర్పించె
న్నభస్యంబునన్

చతుర్ధాశ్వాసము - 133. [ 11 వ పద్యం ]

కాపు స్త్రీలను ఆసభ్యముగా వర్ణించెను.

అదే విధముగా రెడ్లని పిసనారులనెనొకచోట.
విడువ ముడువ వేపరని వీ సంబుగల రెడ్డి,
దుప్పటికొంగులో బీదవారు కాసు వీసం ముడి వేసుకొని అత్యవసరమైనప్పుడు కూడా దాన్ని విడువలేక విడిచి వాడుకొందురుని,పద్యంలో రెడ్లను పిసనారులుగా వర్ణన చేసినాడు కవి రాయలు.

వసంతమాసం.
◆◆◆◆◆◆◆◆
గోదాదేవి ప్రేమ.
◆◆◆◆◆◆◆◆

ఉద్యానవనాలు నలువైపులా పచ్చదనంతోటి నిండిపోయినాయి ,పొదరిళ్ళు దట్టంగా చాలా పొందికతో అల్లుకొన్నాయి, ఓ ఉద్యానంలోన చెట్ల మధ్య బాటలో తెల్లతామర కొలను పక్క నడుస్తున్నాడు విష్ణుచిత్తుడు. తులసితోటకి పక్కన అక్కడో పాలరాతి తిన్నె , దాని మీదో చిన్నిపాప,మోములో చక్కనికళ,చాలాచక్కని మనోహరమైన రూపం. విష్ణుచిత్తుడికి పిల్లలు లేరు , కనుక పాపను విష్ణుప్రసాదం అనుకొని అనుకున్నాడు, సంతోషంతో పాపను ఇంటికి  తీసుకుని వెళ్లి గోదాదేవిగా నామకరణం చేసి, ఆమెను అల్లారుముద్దుగా పెంచుతున్నారు.
కాలచక్ర పరిభ్రమణంలో కాలనుగుణమైనట్టి మార్పులతో బాల్యం నుండి యవ్వనవతిగా గోదాదేవికి యవ్వనోదయమైనది,ఇక ఆమె సౌందర్యం వర్ణన చేయాలంటే ఒకే ఒక్కమాట చెప్పుకోవాలి ఆమె సౌందర్యం ప్రపంచంలోనే లోకాద్భుతసౌందర్యం.

గోదాదేవి మదనతాపభరము.
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

విష్ణువు ఆశీస్సులుతో తనకు గొప్ప సంపదలు కలిగినా విష్ణుచిత్తుడు మాత్రం యథాప్రకారం స్వామికి అనేక పూలమాలలు,చెంగల్వపూల మాలలు,తులసి మాలలు స్వయముగా కట్టి  అర్పిస్తున్నాడు .భగవంతుడి కోసం తన తండ్రి కట్టిన మాలలను గోదాదేవి ముందుగా తను వాటిని ధరించి నీటిలో తన ప్రతిబింబం[నీడ] చూసుకొని తర్వాత వాటిని యధాస్థానంలో పెట్టేస్తోంది.ఆమె పాడే పాటలు తమిళ బాష .
అందువల్లనే తమిళనాడులో చూడికొడుత్త నాచ్చియార్ పేరుతో ఈమె ప్రసిద్ధి చెందినది.
ఆమె చెలికత్తెలు నాగకన్యలు.తన చెలులతో విష్ణుగాథల్ని తల్చుకుంటూ ఏఏ అవతారాల్లో అతను ఎవరిని ఎలా వరించాడో వివరించి చెప్తూ పరవశిస్తూ కాలం గడుపుతోంది.ఆమె మనస్సులోని భావాలను తెలియచేస్తుంటే
జన్మాంతరాల బాంధవ్యం ఆమెలోని విరహం రేపుతోంది.గోదాదేవి మన్మథతాప హృదయ భారం వర్ణనను రాయల వారు ఎలా చేశారో  చూడండి క్రింది పద్యంలో.

నెలఁతఁ గుచకుంభ యుగళ ముండియు
వియోగ

జలధి నీఁదింప లే దయ్యో; సఖులు వంచు

చున్న పన్నీటి వెల్లి లోఁగొన్నకతన

ముంప కది లాఘవమున దేలింపఁగలదే.

పంచమాశ్వాసము - 151. [ 12 వ పద్యం ]

పద్య తాత్పర్యం ఒకసారి పరిశీలిద్దాం.

కుండలను సాయముగానుంచుకుని యీది నీళ్లను దాట వచ్చును ,అటుల యీదు చున్నపుడు కుండలలోనికి నీళ్లు జొరబడెనా అవి తేలింపక ముంచివైచును.ఆమె కుచములనియెడు జంట కుండలుండియు శరీరతాపమును తగ్గించుటకై చెలికత్తెలు పోసిన పన్నీటి ఝల్లులు వాని లోనికి జొచ్చి నందున అవి నిండి ఆమెను వియోగ సముద్రములో ముంచినవే కానీ తేలించినవి కావు!

ఆలా గోదాదేవి స్వామి పాటలను దివ్యగానం చేస్తోంది. నిరంతరం స్వామినే తల్చుకుంటూ పూజిస్తూ గడుపుతోంది.అదంతా కూడా తనకి తెలియని ఓ రకమైన తపస్సు అనుకున్నాడు  విష్ణుచిత్తుడు. ఈ విషయం ఏమిటో తెలుసు కోవాలని ఓ రోజు ఆ స్వామికే ఆమెని గురించి  వివరించి చెప్పి, స్వామి నా కూతురు నిన్ను
ప్రేమించు చున్నది ,ఇది ఎట్లు కుదురును ?
అని స్వామిని విష్ణుచిత్తుడు అడుగగా,స్వామి
మందహాసం చేసేడు చెప్పినదంతా విని!
ముందుగా విష్ణుచిత్తుడికి మాలదాసరి కథని
చెప్పుట ప్రారంభించెను.

మాలదాసరి కథ ::
◆◆◆◆◆◆◆◆◆

మాలదాసరి - మంగళకైశికి.

భగవంతుడు ఈ ఆముక్తమాల్యద కావ్యంలో రెండు కధలు చెపుతాడు,మొదటి కధ స్వామి తన సతీమణియైన లక్ష్మీదేవికి స్వయముగా చెప్పిన యామునాచార్యల కథ.ఇక రెండవది విష్ణుచిత్తుడికి చెప్పిన ఈ కథ.

ఓయీ! విష్ణుచిత్తుడా!
పూర్వమొక చెప్పరాని కులమువాడు కలడు.
వాడు నా భక్తుడు , నేను వామనావతారము
వహించియున్న క్షేత్రమునకు మూడామడల
దూరంలో ఇతడు నివసించును.తెల్లవారక
ముందు బయలుదేరి నా గుడికి వచ్చును.
అతడు వచ్చి మంగళకైశికీ రాగముతో నన్ను పాడుచుండును. వాని శరీరం అశుచి, వాని
హృదయం శుచి, వాడు కట్టింది మసి పాత.
వాని చెవులకు ఇత్తడి శంఖచక్రలా దుద్దులు.
చేతిలో చిటితాళములు.అతనికి ఇటువంటి లక్షణములు కలవు.వాడు దినదినము కూడా నా దేవాలయముకి వచ్చి ఆనంద బాష్పలతో పాడుచు తన యొడలు కూడా మరచిపోయి తాండవము చేయును, చేతిలోన కిన్నెరవీణ యుండును,దాని మీదనే మీటుచుండును. ఇట్లు చాలా సేపు ఆడి,పాడి,సాష్టాంగముచేసి స్వామికి అభిషేకం చేయగా ఆ నీరు బయట రాతి తొట్టెలో నిండి యుండును.శూద్రుని చేత ఆ జలము తన చేతిలో పోయించుకొని అట్టి                       నీటిని త్రాగి, ప్రోద్దెక్కి తన యూరు పోవును, ఇది అతని యొక్క దిన చర్య.క్రింది ఇచ్చిన పద్యములు చుడండి.

కలఁ డొకరుండు పేరుకొనఁ గాని కులంబు
మదీయభక్తుఁ, డి

య్యిల మును వాఁడు వామనత నే వసియించిన పుణ్యభూమియం

దుల కొకయోజనత్రయపు దూరపుటూర
వసించి, బ్రహమ్మ వే

ళలఁ జనుదెంచి , పాడు మము లాలస
మంగళనామ కైశికిన్

షష్టాశ్వాసము - 3.   [ 13 వ పద్యం ]

అహరహంబు నమ్మహాత్ముండు.

3 వ పద్యం 5 వ పద్యంకి మధ్య వచ్చు[వ].
షష్టాశ్వాసము  - 4.

జాత్యుచితచరిత్రమమ

త్రీపిత్యర్థం బూఁది తనదు హృదయము    శుచి తా

నిత్యంబుగఁ దత్తనుసాం

గత్యము మసిపాఁత మానికంబై యొదుఁగున్

షష్టాశ్వాసము - 5. [ 14 వ పద్యం ]

చమురైన తోల్కుబుసంబు టెక్కియను ని
త్తళి శంఖ చక్ర కుండలము లమర.

దివెదారికొమ్ముఁ దోల్తిత్తియు జోడమ్ము
మెడమీఁది మొగలాకు గొడుగుఁ దనర.

మత్పాదరక్షయు మావు పెన్వెఱకఁ గు
ట్టిన యోటి తిపిరిదండెయును మెఱయఁ,

జిటితాళముల సంక పుటిక నొక్కొకమాటు
గతిర యంబునఁ దాఁకి కలసి మొరయ.

షష్టాశ్వాసము - సీ 6.   [ 15 వ పద్యం ]

పలుఁద వనమాలకంటెయు మలిన తనువుఁ

బట్టెతిరుమన్ను బెదురుఁగెఁపుట్టుఁ జూపుఁ

బసుపుఁబొడితోలువల్వంబు నెసకమెసఁగ

వచ్చుసేవింప సురియాళు వైష్ణవుండు.

షష్టాశ్వాసము  - 6. [ 16 వ పద్యం ]

గండాభోగముల న్ముదశ్రులహరు ల్గప్ప న్ముతు
ల్పాడియా

దండ న్ర్వేఁగులు డించి భక్తి జనితో
ద్యత్తాండవం బాడు, నా

చండాలేతరశీలుఁ డుత్పలకియై చండాలిక
న్నీఁటుచున్,

గుండు ల్నీరుగ, నెండ గాలి పసి తాఁకుఁ జూడ, కాప్రాహ్ణమున్.

షష్టాశ్వాసము - 7.   [ 17 వ పద్యం ]

అట్లు దడువగఁ గొల్చి సాష్టాంగ మెఱఁగి

గర్భ మండపిఁ గడిగిన కలఁకజలము

లోని ఱాతొట్టి నిండి కాలువగఁ జాఁగి

గుడివెడలి వచ్చునది శూద్రుఁ డిడఁగఁ గ్రోలి.

షష్టాశ్వాసము - 8. [ 18 వ పద్యం ]

మరులు తీగ ::
●●●●●●●●●

ఇట్లుండగా నొక్కనాడు అర్థరాత్రి వేళ దాసరి గృహం పక్కనున్న కోళ్లగుడిసెలో పిల్లి దూరగా దాంతో  కోళ్ళు గాబరాపడి కూయగా నితడు [ దాసరి] తెల్లవారినదనుకొని స్వామి సేవకి బయలుదేరెను.అలా అతడు బయలుదేరి దారిలో మరులు తీగను త్రొక్కెను.క్రిందిపద్యం
చుడండి.

మరులుఁ దీఁగ మెట్టి యిరు లన్ననో యని

యెడు తమిస్రఁ గాడుపడి పొలంబు

లెల్లఁ దిరిగి తూర్పు దెల్ల నౌతణి నొక్క

శూన్యగహనవాటిఁ జొచ్చి చనుచు

షష్టాశ్వాసము -12. [ 19 వ పద్యం ]

మరులు తీగను మర్లు మాతంగి యని కూడా యందురు ,అదొక అలుము. సన్నని ఆకులు యుండును. దీని కాయ గురిగింజంత ఎర్రగా యుండును. రెండు విత్తులు ఒక్క దానికొకటి ఎదురుగ వేర్వేరు దిక్కుల మొగమైనుండును. ఈ తీగ త్రొక్కినవారు దారి తప్పుదురు,దాసరి ఎక్కడెక్కడో తిరిగేడు.అలా తిరిగి తిరిగి ఒక నిర్జనమైన ప్రదేశంలో ఒకచోట పడిపోయిన గోడలు,కపింద గోరింద పొదలు,విరిగిపోయిన యేతాల కఱ్ఱలు, బీడుపడ్డ పొలాలుదాటి,ఒక పాడుపడ్డ గ్రామం కనపడెను. అతని కాళ్ళకి పాపం ఒకవైపు ఉత్తరేనికాయలు గీచుకున్నా, మరోవైపు పల్లేరుగాయలు గుచ్చుకుంటున్నా  ఆగలేదు ,ఆలా పోయి పోయి అర్ధ యోజనం పొడుగుగల జడలు కలిగిన మహావిస్తారమైన ఓ వటవృక్షం[ పెద్దమఱ్ఱిచెట్టు]ను చూచినాడు.
[అతనికి కనిపించిన వటవృక్షం వర్ణన పద్యం.]

కాంచె న్వైష్ణవుఁ డర్థ యోజన జటా ఘాటోత్థశాఖోపశా

ఖాంచజ్జాటా చరన్మరుద్రయ దవీయ ప్రేషితోద్యచ్ఛదో

దంచ త్కీటకృత వ్రణచ్ఛలన లిప్యాపాదితాధ్వన్య  ని

స్సంచారాత్త మహాఫలోపమ ఫల స్ఫాయద్వ టక్ష్మాజమున్‌

షష్టాశ్వాసము - 15. [ 20 వ పద్యం ]

అప్పుడు మాలదాసరికి అక్కడున్న వటవృక్షం
ప్రక్కననొక కాలి త్రోవను చూసినాడు,వెంటనే అట్నుంచి దగ్గర దారి ఏమైనా వుందేమోనని భావించి అతడు అటువైపుగా నడిచినాడు, అక్కడ ఎక్కడ చూసినా పుర్రెలు, మాంసము పళ్ళతో గీకికొని తిన్న బొమికెలు,ఇక ఈగల్తో ముసురిన మలినపదార్ధములు,పచ్చితోళ్ళు, గాలికెగురుతున్న మనుషుల శిరో కేశములు, ముక్కలై పడున్న అవయవాలు, వాటి కోసం పోరాడుతున్న మృగాలు , ముక్కులు పగిలే కుళ్ళున మాంసం కంపు,వీటన్నింటిని చూచి  తనలో ఇట్లనుకొనెను,ఈ చెట్టు మీద నెెవడో నున్నాడు ,వాడు మాత్రం మానవుడు కాదు, అనే అనుమానం దాసరి మనసులో అప్పుడే ప్రవేశించిందో లేదో ,సరిగ్గా అతని అనుమానం నిజం చేస్తూ ఎదురుగా ఆ చెట్టు మీద యున్న కుంభజానుడునే రాక్షసుడు కనిపించుతాడు.

బ్రహ్మరాక్షసుడు ::
◆◆◆◆◆◆◆◆◆

బ్రహ్మరాక్షసుడు ఒక మానవ కళేబరమును మొలత్రాడుగా చుట్టినాడు, నల్లటి శరీరాన్ని ఎర్రటి కంబళితో కప్పుకున్నాడు, తిరగేసిన ఏనుగుతలలా ఉంది వాడి ముఖం,పాయలు
తీసిన గడ్డాలు, మీసాలు,రెండు పెద్ద కోరలు,
జందెంగా వేలాడుతున్నయ్‌ మనిషిపేగులు.
వేలాడుతున్న పొట్ట.

[ బ్రహ్మరాక్షసుడి గురించి వర్ణన చేసిన రెండు పద్యాలు.]

మృతమర్య్తు రెంటాన నిడ్డఁ జాలక నెత్రు
రంజిల్లు పెనుఁబొట్ట ముంజివానిఁ,

బల్లచీమల వక్రభల్లాతకియుఁ జోలె
నెఱ్ఱదుప్పటి నొప్పు కఱ్ఱెవాని,

వ్యత్యస్తహస్తిమ స్తాభఁ బాయగు గడ్డ
మును దంష్ట్రికలుఁ బొల్చు మొగమువానిఁ,

గడుఁదుర్ల నిడు తుట్టెగతిఁ జోంగలోఁ బాండు
రత మించు కపిలకూర్చంబు వాని,

షష్టాశ్వాసము - సీ19. [ 21 వ పద్యం ]

నెరకుఁ దెెఱువరిఁ గన శాఖ లెక్క జాఱు

ప్రేవుజందెంబు గసరి పైఁ బెట్టువాని

వ్రేలు డగుబొజ్జ గల బూరగాలివానిఁ,

జెంబుతలవాని నవటు కచంబువాని

షష్టాశ్వాసము - సీ19. [ 22 వ పద్యం ]

ఆకలిమీద నున్నాడెమో, ఇంకా తనకి తిండి తీసుకురాలేదని పిశాచుల్ని బండబూతులు తిడుతున్నాడు ,ఇంతలో దాసరిని చూసాడు,
అమాంతంగా ఎగిరిదూకి అతని ముందుకు వచ్చాడు,దాసరి కూడ తక్కువ వాడేం కాదు యుద్దాల్లో ఆరితేరినవాడు, బలవంతుడు, అంతలోనే ఇద్దరనూ యుద్ధానికి దిగినారు, పిడిగుద్దులుతో కొంతసేపు సాగిన తరువాత, ఇలా కాదని దాసరిని కొట్టిచంపుట కొరకు ఒక సాధనం కోసం చుట్టూ చూసేడు వాడు. ఇదే సమయమని దాసరి వాణ్ణి తన్ని పడవేసి పరిగెత్తబోయేడు, వెంటనే ఆ బ్రహ్మరాక్షసుడు పిశాచులతో అతడిని పట్టుకొనమని కేకలు వేయగా ,ఆచటి పిశాచులన్నియును కలిసి అతడి వెంటబడి పట్టుకున్నారు. ఆలా వారికి చిక్కిన దాసరి చాలా ధైర్యంగా ఆరాక్షసుడితో ఇలా అన్నాడు నాకు చావుని గురించి భయం లేదంటూ, నాకు ఒక వ్రతం వుంది, అది రోజూ ఈ దగ్గర్లో ఉన్న కురుంగుడికి పోయి అక్కడ విష్ణు కీర్తనలను పాడి వస్తాను, ఇవేళ కూడ నేను అలాగే చేసే అవకాశాన్ని నాకివ్వు, నేను తిరిగొచ్చి నీకు ఆహారం అవుతాను అంటాడు, అందులకు రాక్షసుడు నవ్వి ఒకసారి నువ్వు యిక్కణ్ణుంచి పోతే నువ్వు మళ్ళీ తిరిగిరావని నాకు తెలియదా, నీ మాటలు కట్టి పెట్టు అని కొట్టిపారవేస్తాడు,అప్పుడు మాలదాసరి ఒక ఘోరప్రతిజ్ఞ చేస్తాడు,ఆ ప్రతిజ్ఞ ఏమిటంటే ఎవనివల్ల ఈ విశ్వం పుడుతుందో, ఎవనిలో ఉంటుందో, చివరికి మళ్ళీ ఎవనిలో విశ్వం లీనమైపోతుందో ఆ విష్ణువుకి మరో దేవుడిని ఏవర్నో సమానంగా భావించిన పాపాన నేను పోతాను,ఇక్కడకు నేను తిరిగి రాకుంటే అని,
అప్పటికి నమ్మకం కలిగి రాక్షసుడు దాసరిని ఒదిలి పెడతాడు.

మోక్షప్రాప్తి ::
◆◆◆◆◆◆

అచటనుండి దాసరి వెంటనే గుడికి వెళ్లి తన స్వామికి స్తోత్రగీతాలు పాడి ,వెంటనే ఇచ్చిన మాట ప్రకారం రాక్షసుడి దగ్గరికి తిరిగి వచ్చి  తృప్తిగా భోంచెయ్యి అని అంటాడు,అప్పుడు
బ్రహ్మరాక్షసుడు దాసరి కాళ్ళమీద పడి తనని కరుణించి తను చేసిన పాపాలన్నియు తొలగి పోవుటకు దాసరి ఆరోజు విష్ణువుకి పాడిన గాత్ర ఫలం తనకి దానం చేస్తే యీ రాక్షసజన్మ పోతుందని ప్రాధేయపడగా, అప్పుడు దాసరి నువ్వు బ్రహ్మరాక్షసుడిగా ఏందులకు ,ఏలాగా, మారిపోయినావో చెప్పమన్నాడు, రాక్షసుడు ఇలా చెప్పేడు తను పూర్వజన్మలో సోమశర్మ అనే బ్రాహ్మణుణ్ణని,నేను ఘోరమైన పాపం చెయ్యటం వల్ల ఇలా రాక్షసుడిగా మారితినని తన కథ మొత్తం చెప్పినాడు బ్రహ్మరాక్షసుడు.
అంతా విన్న దాసరి దేనిఫలం ఏమిటో నాకేమీ తెలియదు అన్నిటినీ చూసుకునేది నాస్వామి నారాయణుడొక్కడేనని దాసరి అంటూండగా అతని మాటలు అతని నోటిలోనుండగానే, బ్రహ్మరాక్షసుడి రూపం మారిపోసాగింది,ఇక మళ్ళీ సోమశర్మగా, వైష్ణవ చిహ్నాలు ధరించి నిలిచేడు ఎదురుగా,ఇలా దాసరి యొక్క కథ  విష్ణుచిత్తుడికి శ్రీమహావిష్ణువు చెప్పి ,నాకు చేసే భజనల యొక్క ప్రభావం ఎంతటి గొప్ప విలువైనదో ఇప్పుడు తెలిసింది కదా,కనుక నీ కూతురు ద్రవిడప్రబంధాలను చాలా చక్కగా పాడుతున్నందుకు నువ్వు ఆనందించాలి.ఇక ఆమె పూర్వజన్మలో భూదేవి. నీవు ఆమెను శ్రీరంగానికి తీసుకెళ్ళు, నీకు అంతయు మేలు జరుగుతుందని చెపుతాడు.
                                  [సశేషం]

No comments